తన సుమధుర గానంతో శ్రోతలకు వీనుల విందును పంచిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. గాయకుడిగానే కాదు, డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా వెండితెర ముందూ వెనుక తనదైన ముద్రవేశారు. గాయకుడిగా బిజీగా ఉన్న సమయంలోనూ చక్కని పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. బాలూ తొలిసారిగా వెండితెరపై కనిపించిన చిత్రం మహమ్మద్ బీన్ తుగ్లక్(1972).
ఆ సినిమాలో ఒక పుట్టిన రోజు వేడుక ఉంది. ఆ వేడుకలో ఒకరు పాట పాడాలి. ఆ పాటను బాల సుబ్రహ్మణ్యంతో పాడించి రికార్డు చేయించారు. అయితే, ఆ సన్నివేశంలో ఎవరు నటిస్తే బాగుంటుందా? అని తర్జనభర్జనలు పడ్డారు దర్శక-నిర్మాతలు. అయితే షూటింగ్ చేసే సమయానికి సినిమాలో కూడా బాలూతోనే పాట పాడిస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయం బాల సుబ్రహ్మణ్యంకు చెబితే ఆయన అంగీకరించారు. అలా గాన గంధ్వరుడు తొలిసారి తెరపై కనిపించారు. నటుడిగా ఎన్నో గుర్తుండిపోయే పాత్రలను చేసిన బాలసుబ్రహ్మణ్యం బాపు-రమణల రెండో చిత్రం ‘బంగారు పిచిక’లో కథానాయకుడిగా చేసేందుకు మాత్రం అంగీకరించలేదు.
Courtesy: https://www.eenadu.net/cinema/morenews/8/2019/06/02/106862/bala-subramanyam-first-movie
No comments:
Post a Comment